Jharkhand : జార్ఖండ్‌లో సుమారు 8 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కరే టీచర్

by Shamantha N |

జార్ఖండ్ వ్యాప్తంగా సుమారు 8 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కరే టీచర్ గా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల సంక్షోభంపై బీజేపీ ఎమ్మెల్యే లేవనెత్తిన ప్రశ్నకు జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి సమాధానం ఇచ్చారు.

Jharkhand : జార్ఖండ్‌లో సుమారు 8 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కరే టీచర్
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ వ్యాప్తంగా సుమారు 8 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కరే టీచర్ గా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంక్షోభంపై బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సిన్హా అసెంబ్లీ లేవనెత్తిన ప్రశ్నకు జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జార్ఖండ్ వ్యాప్తంగా 7,930 ప్రభుత్వ పాఠశాల్లో సింగిల్ టీచర్ ఉన్నారని.. ఈ స్కూల్స్ లో 3.81 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు పేర్కొన్నారు. 103 పాఠశాలల్లో విద్యార్థులు లేరని, వాటిలో 17 మంది ఉపాధ్యాయులను నియమించారని అన్నారు. అయితే, డ్రాపౌట్‌లను వారి సంబంధిత పాఠశాలలకు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అందుకోసం చలో అభియాన్ ని ప్రారంభించినట్లు తెలిపారు. అంతేకాకుండా, ఈ సమస్యను ఎదుర్కోవడానికి 26 వేల మంది అసిస్టెంట్ టీచర్లను నియమించేందుకు సిద్ధం అవుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు, ఏప్రిల్ 2023 ప్రారంభంలో స్కూల్స్ లో చేరిన విద్యార్థులలో 22 శాతం మంది సింగిల్-టీచర్ స్కూల్స్ లోనే చదువుతున్నట్లు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టివిస్టులు తెలిపారు. దీంతో, చిన్నారులు సరైన విద్యను పొందలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. జార్ఖండ్‌లోని 6,904 సింగిల్-టీచర్ పాఠశాలల్లో 93 శాతం ప్రాథమిక పాఠశాలలేనని తెలిపారు.

Next Story