- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Brutal incident: ఆమె ముఖంపై దాదాపు 250 కుట్లు.. ఢిల్లీలో మహిళపై దారుణ ఘటన (ఫోటో)
ఈశాన్య ఢిల్లీలో దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Northeast Delhi) ఈశాన్య ఢిల్లీలో దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భజన్‌పురా ప్రాంతంలో ఒక మహిళను ఆమె సొంత భర్త, అతని అన్నయ్య దారుణంగా కొట్టారు. పదునైన ఆయుధంతో ఆ భార్య ముఖం, శరీరంపై అనేక చోట్ల దాడి చేశారు. ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స సమయంలో, ఆ మహిళకు దాదాపు 250 కుట్లు పడ్డాయి. ఆ మహిళకు చెంప, నుదురు, చెవిపై కుట్లు వేశారు. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి బాధితురాలు షబ్నం యూపీలోని ముస్తఫాబాద్ ప్రాంతానికి చెందినది. తన భర్తతో గొడవల కారణంగా తల్లి ఇంట్లో నివసిస్తుంది. ఏప్రిల్ 4న, ఆమె భర్త నజ్బుల్ హసన్ ఢిల్లీలోని మోహన్‌పురి నూర్ ఇలాహి ప్రాంతానికి మాట్లాడటానికి పిలిచాడు. బాధితురాలు అక్కడికి వెళ్లి వారితో మాట్లాడింది. ఈ క్రమంలోనే భర్త, భర్త అన్నయ్య దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దాడికి పాల్పడే సమయంలో ఆ మహిళ ఏదో విధంగా తన ప్రాణాలను కాపాడుకోని పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు వచ్చి ఆమెను హాస్పటిల్‌లో చేర్మించి బాధితురాలి వాంగ్మూలం సేకరించారు. బాధితురాలు "నన్ను మోసం చేసి నా అత్తమామల ఇంటికి పిలిపించారు. ఆ తర్వాత వారిద్దరూ నన్ను చంపడానికి ప్రయత్నించారు" వాంగ్మూలం ఇచ్చింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.






