- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NDA: ఆపరేషన్ సిందూర్‌లో సాయుధ దళాల ధైర్య సాహసాలు భేష్.. ఎన్డీఏ భేటీలో తీర్మానం
పరేషన్ సిందూర్‌లో భారత సాయుధ దళాల దైర్య సాహసాలు ప్రశంసిస్తూ ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) లో భారత సాయుధ దళాల దైర్య సాహసాలు, ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) సాహసోపేతమైన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో ఓ తీర్మానాన్ని ఆమోదించారు. శివసేన చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే (Eknath shinde) ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా ఇతర నేతలందరూ ఆమోదం తెలిపారు. ఆపరేషన్ సిందూర్ భారత ప్రజల మనోధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని గణనీయంగా పెంచిందని కూడా తీర్మానంలో పేర్కొన్నారు. మోడీ ఎల్లప్పుడూ సాయుధ దళాలకు మద్దతు ఇస్తున్నారని, ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులకు తగిన సమాధానం ఇచ్చిందని తెలిపారు. ఢిల్లీలోని ఆశోకా హోటల్‌లో నిర్వహించిన ఈ భేటీలో ఆపరేషన్ సిందూర్, కుల గణన, సుపరిపాలన, బిహార్ ఎన్నికలు, మోడీ 3.0కు ఏడాది అయిన సందర్భంగా వేడుకలు జరుపుకోవడం సహా వివిధ అంశాలపై చర్చించారు.
అనవసర ప్రకటనలు చేయొద్దు: ప్రధాని మోడీ
ఈ సమావేశంలో ప్రధాని మోడీ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. నాయకులు తమ బహిరంగ ప్రకటనలలో సంయమనం పాటించాలని అనవసర కామెంట్స్ చేయొద్దని సూచించారు. ఆపరేషన్ సింధూర్‌లో మూడో పక్షం ప్రమేయం లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇటీవల కొంతమంది బీజేపీ నాయకులు ఆపరేషన్ సిందూర్, ఆర్మీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మోడీ పార్టీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ నడ్డా సైతం పాల్గొన్నారు. అలాగే 20 రాష్ట్రాల సీఎంలు, 18 రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు.






