ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం.. మోదీకి సన్మానం

by Naga Rani Yarlagadda |

ఎన్డీయే పక్షాల పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు.

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం.. మోదీకి సన్మానం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్డీయే పక్షాల పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయినందుకు మోదీని పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎన్డీయే నేతలు సన్మానించారు. అనంతరం పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని.. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్లో ప్రతిష్ఠంభన కొనసాగుతున్న క్రమంలో ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా.. రెండ్రోజుల క్రితం ప్రధాని మోదీ, అమిత్ షా రాష్ట్రపతితో విరివిరిగా భేటీ అవ్వగా.. ఆమెతో చర్చించిన విషయాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించడంపై చర్చలు జరిగాయన్న టాక్ వినిపించగా.. ఆ అంశంపై పార్లమెంటరీ భేటీలో చర్చ జరుగుతుందని తాను అనుకోవట్లేదని ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి నేటికి ఆరేళ్లవుతున్న క్రమంలో రాష్ట్రహోదాపై పార్లమెంట్ సెషన్స్ ముగిసేలోపు ఏదొక నిర్ణయం తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Next Story