NDA: రేపే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన.. రేసులో కీలక నేతలు !

by B.Srinivas |

ఎన్డీఏ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఆదివారం ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ప్రకటన చేయనున్నారు.

NDA: రేపే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన.. రేసులో కీలక నేతలు !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్డీఏ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఆదివారం ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ప్రకటన చేయనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ భేటీకి ప్రధాని మోడీ (Modi), కేంద్ర మంత్రులు అమిత్ షా (Amith shah), రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh), జేపీ నడ్డా సహా ఇతర ప్రముఖులు హాజరుకానున్నట్టు సమాచారం. అభ్యర్థిని వెల్లడించిన తర్వాత ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆగస్టు 19న ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంటు ప్రాంగణంలో ఈ మీటింగ్ జరగనుండగా వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక, పార్టీ సంస్థాగత ఎన్నికలు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. అనంతరం ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

రేసులో ఉన్నది వీరే?

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ పలువురు కీలక నేతలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకె సక్సేనా, బిహార్ గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సిక్కిం గవర్నర్ ఓం మాథుర్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాల పేర్తను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అంతేగాక ఆర్ఎస్ఎస్ నేత శేషాద్రి చారి పేరును సైతం పరిగణనలోకి తీసుకున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాబోయే బిహార్ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌ను సైతం నామినీగా పరిశీలిస్తున్నట్టు వెల్లడించాయి. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుండగా అదే రోజు ఫలితం వెల్లడికానుంది.

Next Story