- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీహార్ జడ్జిమెంట్ డే: పూర్తి ఆధిక్యంలో ఎన్డీయే కూటమి
దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్ ప్రారంభం అయింది. పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైన ఎన్డీయే కూటమి లీడింగ్ కోనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్ ప్రారంభం అయింది. పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైన ఎన్డీయే కూటమి లీడింగ్ కోనసాగుతోంది. నెమ్మది నెమ్మదిగా అన్ని ప్రాంతాల నుంచి అప్ డేట్స్ వస్తుండగా.. అధికార ఎన్డీయే కూటమి పూర్తి ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ.. ఎన్డీయే కూటమి నుంచి పోటీలో నిలిచిన అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్, సామ్రాట్ చౌదరి, అతి పిన్న వయస్కురాలు అయిన మైథిలి ఠాకూర్, కేబినెట్ లోని 10 మంది మంత్రులు ముందంజలో దూసుకుపోతున్నారు. అలాగే మహాగట్ బంధన్ సీఎం అభ్యర్థి అయిన తేజస్వీ యాదవ్ కూడా లీడ్ లో కొనసాగుతున్నాడు. అలాగే ప్రతిపక్ష కూటమి మొత్తం 68 స్థానాల్లో లీడులో కొనసాగుతుండగా.. అందులో కాంగ్రెస్ కేవలం 11 స్థానాల్లోనే లీడ్ లో ఉంది.
మొత్తం 243 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. ప్రస్తుతం 200 స్థానాలకు సంబంధించిన ట్రెండ్ వచ్చింది. ఇందులో అధికార ఎన్డీయే కూటమి 130 స్థానాల్లో లీడ్ కొనసాగిస్తూ.. అధికారం చేపట్టడానికి అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసింది. ఇందులో బీజేపీ 58 , జేడియూ 54 ,ఎల్జేపీ 9, ఇతర అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రశాంత్ కిశోర్ కు బీహార్ ఓట్లర్లు ఉహించని షాక్ ఇచ్చారు. ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు మాత్రమే ప్రస్తుతం లీడ్ లో కొనసాగుతున్నారు. మరో 43 స్థానలకు సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 46 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా, అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ పర్యవేక్షణ, మూడు స్థాయిల భద్రత అమల్లో ఉన్నాయి. ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ NDA కూటమి, మహాగఠబంధన్ మధ్య జరుగుతుంది.
Read More..
Live Updates : బిహార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్
షేక్‌పేట్‌లో హోరాహోరీ.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు స్వల్ప ఆధిక్యం






