- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NCERT: పాఠ్యపుస్తకాల్లో ఆపరేషన్ సిందూర్.. ఎన్సీఈఆర్టీ కీలక నిర్ణయం !
విద్యార్థులకు జాతీయ భద్రత, సైనిక వ్యూహాలు, దౌత్యంపై అవగాహన కల్పించేందుకు ఎన్సీఈఆర్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: విద్యార్థులకు జాతీయ భద్రత, సైనిక వ్యూహాలు, దౌత్యంపై అవగాహన కల్పించేందుకు ఎన్సీఈఆర్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల భారత్ పాక్ మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) సహా పలు అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చనున్నట్టు విద్యా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బోధనా మాడ్యూల్ ను సైతం రూపొందిస్తోంది. 3 నుంచి12వ తరగతి వరకు విద్యార్థులకు దీని గురించి బోధించనున్నారు. ప్రస్తుతం రెండు మాడ్యూల్స్ అభివృద్ధిలో ఉన్నాయి. కటి 3 నుండి 8 తరగతులకు ఒకటి, 9 నుంచి 12వ తరగతి వరకు మరొకటి ఉంటుంది. ప్రతి మాడ్యూల్ దాదాపు 8 నుంచి10 పేజీలు ఉండనుండగా దీనిలో పహెల్గాం ఉగ్రదాడి, దానికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్, ఉగ్రస్థావరాల ధ్వంసానికి తీసుకున్న సైనిక వ్యూహాలు, దౌత్యం వంటి విషయాలు వివరించనున్నారు. ‘ఉగ్రవాదం వంటి ముప్పులను దేశం ఎలా ఎదుర్కొంటుంది. రక్షణ, దౌత్యం, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం ద్వారా జాతీయ భద్రత ఎలా నిర్ధారిస్తుందో విద్యార్థులకు అయ్యేలా చెప్పడమే ఈ మాడ్యూల్ లక్ష్యం’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
వీటితో పాటు భారతదేశ అంతరిక్ష ప్రయాణాన్ని కూడా సిలబస్‌లో చేర్చనున్నారు. ఇందులో భాగంగా చంద్రయాన్, ఆదిత్య ఎల్ 1, ఇటీవల భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubankshu Shukla) ఆక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి చేరుకోవడం వంటి చారిత్రక విజయాలను తెలపనున్నారు. ఈ విషయాల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, పర్యావరణ స్పృహ, దేశ భక్తిని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.






