INS Tarkash: సముద్రంలో భారీగా డ్రగ్స్.. 2,500 కిలోలు సీజ్

by Shamantha N |

హిందూ మహాసముద్ర తీరంలోని భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సముద్రంలో ఇండియన్ నేవీ ఆపరేషన్ నిర్వహించి ఓ నౌకలో అక్రమంగా తరలిస్తున్న 2,500 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నాయి.

INS Tarkash: సముద్రంలో భారీగా డ్రగ్స్.. 2,500 కిలోలు సీజ్
X

దిశ, నేషనల్ బ్యూరో: హిందూ మహాసముద్ర తీరంలోని భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సముద్రంలో ఇండియన్ నేవీ ఆపరేషన్ నిర్వహించి ఓ నౌకలో అక్రమంగా తరలిస్తున్న 2,500 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నాయి. నేవీకి చెందిన ఐఎస్ఎస్ తర్కష్ యుద్ధనౌక అనుమానిక నౌకలను అడ్డగించింది. మార్చి 31న పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఐఎన్ఎస్ తర్కష్‌కు.. భారత నేవీ P8I విమానం నుండి డ్రగ్స్ అక్రమ రవాణాపై సమాచారం అందింది. దీంతో, అనుమానిత నౌకలను ఐఎన్ఎస్ తర్కష్ అడ్డగించడంతో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నేవీ బృందం, మెరైన్ కమాండోలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతం అయ్యింది. సీల్డ్ ప్యాకెట్లలో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2,386 కిలోల హషీష్, 121 కిలోల హెరాయిన్ ని గుర్తించారు. కాగా.. అంతర్జాతీయ జలాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో జరుగుతున్న సముద్ర భద్రతా కార్యకలాపాలలో భాగంగా ఈ ఆపరేషన్ జరిగినట్లు అధికారులు తెలిపారు.

Next Story