- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రంప్ సుంకాల దెబ్బ మోడీకి తగిలింది.. నాటో చీఫ్ సంచలన వ్యాఖ్యలు
ట్రంప్ సుంకాల దెబ్బ భారత ప్రధాని మోడీకి తగిలింది అంటూ నాటో చీఫ్ మార్క్ రొట్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మోడీ ఫోన్ చేసి ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడారని అన్నారు. భారత్ పై సుంకాల భారం పడటంతో పుతిన్ భవిష్యత్ వ్యూహాల గురించి మోడీని అడిగితెలుసుకున్నారని వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: ట్రంప్ సుంకాల దెబ్బ భారత ప్రధాని మోడీకి తగిలింది అంటూ నాటో చీఫ్ మార్క్ రొట్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మోడీ ఫోన్ చేసి ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడారని అన్నారు. భారత్ పై సుంకాల భారం పడటంతో పుతిన్ భవిష్యత్ వ్యూహాల గురించి మోడీని అడిగితెలుసుకున్నారని వ్యాఖ్యానించారు. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకే ట్రంప్ భారత్ పై 50 శాతం సుంకాలు విధించారని అన్నారు. దీంతో అత్యధికంగా సుంకాలు భరిస్తున్న దేశంగా భారత్ నిలిచిందని చెప్పారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని కానీ పుతిన్ దానికి అంగీకరించలేదని అన్నారు. తన మాట వినలేదనే ట్రంప్ రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై సుంకాలు విధిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య కూడా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.






