- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీ, ట్రంప్ ఒకరినొకరు గౌరవించుకుంటారు
డొనాల్డ్ ట్రంప్ రెండో సారి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందుగా కలిసిన దేశాధినేతల్లో నరేంద్ర మోడీ ఒకరని జై శంకర్ గుర్తు చేశారు.

- వారిద్దరూ జాతీయవాదులు
- ద్వైపాక్షిక చర్చలు బాగా జరిగాయి
- ట్రంప్ ఆహ్వానం మొదటిగా మోడీకే అందింది
- కేంద్ర మంత్రి జై శంకర్ వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న సంబంధాన్ని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ప్రశంసించారు. ఇరు దేశాల నేతలు జాతీయవాదులుగా ఒకరినొకరు గౌరవించుకుంటారని చెప్పారు. శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీ లిటరేచర్ ఫెస్టివెల్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి జై శంకర్ పలు విషయాలను వెల్లడించారు. 'ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బలమైన జాతీయవాది. అదే విధంగా డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా జాతీయవాదిగా ఉన్నారు. చాలా విషయాల్లో వారిద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. అందకే వారిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటారు' అని జైశంకర్ చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ రెండో సారి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందుగా కలిసిన దేశాధినేతల్లో నరేంద్ర మోడీ ఒకరని జై శంకర్ గుర్తు చేశారు.
'ట్రంప్ ఆహ్వానం మేరకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ప్రపంచ నేతల్లో అందరి కంటే ముందుగా ట్రంప్ ఆహ్వానం మోడీకే అందింది. అంటే మన ప్రధాని మోడీకి ట్రంప్ ఎంత గౌరవం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు' అని జైశంకర్ అన్నారు. అమెరికా పర్యటనలో పీఎం మోడీ, డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వైట్ హౌస్‌లో జరిగిన ఆ సమావేశం ఎంతో సానుకూల ధోరణితో జరిగింది. నాకు ఎంతో దౌత్య అనుభవం ఉంది. నా జీవితంలో ఎక్కువ సమయం అదే పనిలో ఉన్నాను కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ సమావేశంలో జరిగిన ముఖ్యమైన విషయాలు కూడా తెలుస్తాయని జై శంకర్ చెప్పారు.
పీఎం మోడీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఒక అసాధారణమైన విషయం ఉంది. ప్రపంచంలో ఎంతో మంది దేశాధినేతలు ఉన్నారు. కానీ వారెవరితోనూ సానుకూలంగా వ్యవహరించిన చరిత్ర ట్రంప్‌కు లేదు. కానీ మోడీ విషయంలో మాత్రం అలాంటి వ్యతిరేకత ఏమీ లేదని గుర్తు చేశారు. ఇది ట్రంప్, మోడీ మధ్య ఉన్న సత్సంబంధాలకు నిదర్శనమని జై శంకర్ అన్నారు. కాగా, ఫిబ్రవరి మొదట్లో పీఎం మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఎంతో అతిథి మర్యాదలు లభించాయి. ఇద్దరు నేతలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. పరస్పరం ఒకరినొకరు ఆలింగనాలు ఇచ్చుకుంటూ, అభినందించుకుంటూ కనిపించారు. ఇద్దరు నేతల ద్వైపాక్షిక చర్చల్లో వాణిజ్యం, ఉద్రవాద నిరోధం, రక్షణ సహకారం వంటి కీలక అంశాల్లో చర్చ జరిగింది.






