- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు.. తీర్పు రిజర్వు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు
నేషనల్ హెలార్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హెలార్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుపై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపణలను మరింత చట్టపరమైన విచారణకు తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ (పీసీ యాక్ట్) విశాల్ గోగ్నే జులై 29న ప్రకటించనున్నారు. వివరాల్లోకి వెళితే.. స్వాతంత్రానికి పూర్వం నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను 1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించారు. దానికి అసోసియేటెడ్‌గా జర్నల్స్ లిమిటెడ్ (AJL) వ్యవహరించింది. అయితే, 2008లో రూ.90 కోట్ల మేర అప్పుల కారణంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక మూతపడింది. దీంతో అప్పటి నుంచి ఆ సంస్థపై ఆస్తులపై వివాదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతరులు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)ను స్వాధీనం చేసుకున్నారని.. దీంతో రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా ఆర్జించారని వారు పొందారని 2012లో బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ట్రయల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. కేసుతో సంబంధం ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో పాటు, సుమన్ దుబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్, సునీల్ భండారీలపై ఏప్రిల్ 9న ఛార్జిషీటు దాఖలు చేసింది.
కాగా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు యంగ్ ఇండియన్ సంస్థలో 38 శాతం చొప్పున షేర్లు కలిగి ఉన్నారని ఈడీ ఆరోపించింది. ఏజేఎల్‌కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.90.21 కోట్ల రుణాన్ని రూ.9.02 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్చి.. ఆ షేర్లను రూ.50 లక్షలకు యంగ్ ఇండియన్‌కు బదిలీ చేశారని పేర్కొంది. తద్వారా రూ.2 వేల కోట్ల నుండి రూ.5 వేల కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులపై నియంత్రణ సాధించారని ఈడీ ఆరోపించింది. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) సెక్షన్లు 3, 4, మరియు 70 కింద వారిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ఏప్రిల్ 11, 2025న, ఈడీ ఢిల్లీ, ముంబై, లక్నోలలో రూ.661 కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. వాటిలో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ కూడా ఉండటం విశేషం.






