National Herald Case: సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్

by Prasad Jukanti |

ఈడీ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలకు ఊరట లభించింది.

National Herald Case: సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేషనల హెరాల్డ్ కేసులో (National Herald case) కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీకి (Rahul Gandhi) భారీ ఊరట లభించింది. ఈడీ దాఖలు (ED case) చేసిన మనీలాండరింగ్ చార్జిషీట్ స్వీకరణకు మంగళవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ కేసు దర్యాప్తు ఎఫ్ఐఆర్ ఆధారంగా కాకుండా ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా జరుగుతోందని అందువల్ల ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ ను కొనసాగించలేమని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తివిశాల్ గోగ్నే అన్నారు. కాగా ఏజేఎల్ కు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకోగా.. రాహుల్, సోనియాకు మెజారిటీ వాటా ఉన్న యంగ్ ఇండియాలో రూ. 50 లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెల్లించి ఏజేఎల్ ను సొంతం చేసుకున్నట్లు ఆరోపిస్తూ ఈడీ తన చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసు వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో ఐదుగురిపై ఈడీ కేసులు నమోదు చేసింది. అయితే ఇది ప్రైవేట్ వ్యక్తి, బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా జరుగుతున్న విచారణ కావడంతో ఈ చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకోవడం లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ విషయంలో తదుపరి దర్యాప్తు కొనసాగించడానికి ఈడీకి అనుమతి ఇచ్చింది.

Next Story