- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శుభాంషు శుక్లా అంతరిక్ష ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్: నాసా
శుభాంషు శుక్లా అంతరిక్ష ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు నాసా వెల్లడించింది. బుధవారం మధ్యాహ్నం యాక్సియం-4 మిషన్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఆస్ట్రోనాట్ శుభాంషు శుక్లాను అంతరిక్షంలోకి తీసుకెళ్లే యాక్సియం-4 ప్రయోగం బుధవారం నాడు జరుగుతుందని నాసా వెల్లడించింది. ఈ మిషన్ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మే 29న మొదలవ్వాల్సిన ఈ మిషన్.. పలు సాంకేతిక కారణాలతో ఇప్పటి వరకు మొత్తం ఏడుసార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జూన్ 25 మధ్యాహ్నం 12.01 గంటలకు ఈ ప్రయోగాన్ని లాంచ్ చేయాలని నాసా, యాక్సియ్ స్పేస్, స్పేస్‌ఎక్స్ సంస్థలు భావిస్తున్నాయి.
‘ఫ్లోరిడాలో నాసాకు చెందిన కెనెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ మిషన్ లాంచ్ చేస్తాం’ అని నాసా వెల్లడించింది. భారతీయ కాలమానం ప్రకారం ఆ మరుసటి రోజు (గురువారం) సాయంత్రం 4.30 గంటలకు అంతర్జాతీయ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్)తో డాకింగ్ పూర్తవుతుందని తెలిపింది. ఈ మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాముల్లో శుభాంషు శుక్లా ఒకరు. ఆయన మిషన్ పైలట్‌గా వ్యవహరించనున్నారు.






