Narayanan: 2027లో చంద్రయాన్ 4 ప్రయోగం.. ఇస్రో చీఫ్ నారాయణన్

by B.Srinivas |

దేశ భద్రతలో భాగంగా భూ, సముద్ర సరిహద్దులను పర్యవేక్షించడంలో ఇస్రో కీలక పాత్ర పోషిస్తుందని ఆ సంస్థ చీఫ్ నారాయణన్ అన్నారు.

Narayanan: 2027లో చంద్రయాన్ 4 ప్రయోగం.. ఇస్రో చీఫ్ నారాయణన్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ భద్రతలో భాగంగా భూ, సముద్ర సరిహద్దులను పర్యవేక్షించడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక పాత్ర పోషిస్తుందని ఆ సంస్థ చీఫ్ నారాయణన్ (Narayanan) అన్నారు. 2027లో చంద్రయాన్ 4 ప్రయోగం జరుతుందని, భారత అంతరిక్ష ప్రయాణంలో ఆ ఏడాది ఒక నిర్ణయాత్మక క్షణం అవుతుందని తెలిపారు. భువనేశ్వర్‌లోని సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (CTTC)ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘చంద్రయాన్-4 ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన అత్యంత సంక్లిష్టమైన, ప్రతిష్టాత్మకమైన చంద్ర ప్రయోగం అవుతుంది. చంద్రుని ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకురావాలని మేము ప్రణాళిక వేస్తున్నాం’ అని తెలిపారు.

2027 ప్రారంభంలో ప్రణాళిక చేయబడిన ఈ మిషన్‌లో ఇస్రో మొదటిసారిగా గగన్‌యాన్ మిషన్ కింద భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతుందని చెప్పారు. ఇది భారతదేశ మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాలలో ఒక ప్రధాన ముందడుగుగా నిలుస్తుందన్నారు. చంద్రయాన్-4 తర్వాత, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) భాగస్వామ్యంతో, లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ (LUPEX) అని కూడా పిలువబడే చంద్రయాన్-5ను ప్రయోగించనుందని ప్రకటించారు.

Next Story