NAN 'స్కామ్'.. ఇద్దరు మాజీ IAS అధికారులకు 4 వారాల ED కస్టడీ

by Malleboina Mahesh |

ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన నాగ్రిక్ అపూర్తి నిగమ్ (NAN) కుంభకోణం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

NAN స్కామ్.. ఇద్దరు మాజీ IAS అధికారులకు 4 వారాల ED  కస్టడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన నాగ్రిక్ అపూర్తి నిగమ్ (NAN) కుంభకోణం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ స్కాంలో ఏకంగా ఐఏఎస్ అధికారుల (IAS officers) హస్తం ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ NAN 'స్కామ్‌లో ఇద్దరు మాజీ IAS అధికారులను 4 వారాల ED కస్టడీకి అప్పగించారు. నాగ్రిక్ అపూర్తి నిగమ్ (NAN) కుంభకోణం తో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఇక్కడి ప్రత్యేక కోర్టు మాజీ IAS అధికారులు అలోక్ శుక్లా, అనిల్ తుటేజాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అనుమతించింది.

ఈ ఇద్దరు ప్రత్యేక న్యాయమూర్తి (మనీలాండరింగ్ నిరోధక చట్టం) డమరుధర్ చౌహాన్ కోర్టు ముందు లొంగిపోయారు. ఆ తర్వాత వారిని సోమవారం ED అధికారికంగా అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచింది. "ప్రత్యేక కోర్టు వారి కస్టోడియల్ రిమాండ్‌ను EDకి నాలుగు వారాల పాటు మంజూరు చేసింది. విచారణ కోసం ఇద్దరినీ ఢిల్లీకి తీసుకెళ్తామని ED న్యాయవాది సౌరభ్ కుమార్ పాండే తెలిపారు. కాగా ప్రభుత్వ సరఫరాలలో అవినీతి, అక్రమ ఆర్థిక లావాదేవీలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్న ఈ NAN కుంభకోణం రాష్ట్ర రాజకీయాల్లో, పరిపాలనలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story