- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీకి నమీబియా అత్యున్నత పురస్కారం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. బ్రెజిల్ పర్యటన ముగించుకుని ప్రస్తుతం నమీబియాలో పర్యటిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) విదేశీ పర్యటన కొనసాగుతోంది. బ్రెజిల్ (Brezil) పర్యటన ముగించుకుని ప్రస్తుతం నమీబియాలో (Namibia) పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అంతర్జాతీయ గౌరవం లభించింది. నమీబియా అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్‌షియంట్ వెల్‌విచ్చియా మిరాబిలిస్ (Order of the Most Ancient Welwitschia Mirabilis)' అందుకున్నారు. ఈ పురస్కారాన్ని నమీబియా అధ్యక్షురాలు నెటుంబో నంది ఎన్-దైత్వా ఆయనకు అధికారికంగా అందజేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నేత మోడీనే కావటం విశేషం. అలాగే, 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి మోడీకి ఇది 27వ అంతర్జాతీయ పురస్కారం.
ఇక ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ నమీబియా అధ్యక్షురాలితో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సంబంధాలను సమీక్షిస్తూ, భవిష్యత్తులో వాటిని మరింత విస్తరించేందుకు అవసరమైన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోడీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, వ్యవసాయం, ఖనిజాలు, విద్య, ఆరోగ్యం సహా ఇతర రంగాల్లో సహకారంపై నమీబియా అధ్యక్షురాలితో చర్చించానని పేర్కోన్నారు. ప్రాజెక్టు చీతాకు సహకారం అందించినందుకు నమీబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.






