నమీబియా చీతా "పవన్" మృతి! కారణం ఏంటంటే?

by Geesa Chandu |

మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో మరో చీతా మృత్యువాత పడింది.

నమీబియా చీతా పవన్ మృతి! కారణం ఏంటంటే?
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో మరో చీతా మృత్యువాత పడింది. నమీబియా నుంచి తీసుకువచ్చిన పవన్ అనే మగ చీతా మృతి చెందినట్లు అటవీ అధికారులు మంగళవారం వెల్లడించారు. కాగా ప్రాజెక్టు చీతాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి చీతాలను తెచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 5 వ తేదీన ఆఫ్రికన్ చీతా గామినీకి జన్మించిన 5 నెలల చీతా కూన చనిపోయిన కొద్ది వారాల్లోనే ఈ తాజా ఘటన చోటు చేసుకుంది.

మంగళవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో.. నమీబియా చీతా ఎటువంటి కదలికలు లేకుండా పొదలలో పడి ఉన్నట్లు తాము గుర్తించినట్లు మధ్య ప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులోని అధికారులు తెలిపారు. తర్వాత వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చామని, అయితే వైద్యులు సంఘటన స్థలాన్ని పరిశీలించి.. చీతా ముందు భాగం అంటే శరీరం సగ భాగం నీటిలో మునగడం వల్లే చీతా మరణించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు అయితే పోస్టుమార్టం జరిగితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు.కాగా ఈ చీతా మరణంతో కునో నేషనల్ పార్క్ లో ఇంకా మిగిలినవి 24 చీతాలు మాత్రమే.

Next Story