ఇండియాలో కూడా కోవిడ్ ఆంక్షలు షురూ.. ఎక్కడంటే?

by Dishafeatures2 |
ఇండియాలో కూడా కోవిడ్ ఆంక్షలు షురూ.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: రెండేండ్ల పాటు ప్రపంచానికి కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారి మరోసారి తన ప్రతాపాన్ని చూపించబోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. తాజాగా చైనాలో కరోనా మళ్లీ విలయతాండవం సృష్టిస్తోంది. అక్కడ రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అనధికార లెక్కలు చెబుతున్నాయి. ఓమిక్రాన్ సబ్‌బేరియంట్ బీఎఫ్-7 చైనాను ఉక్కిరిబిక్కరి చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. తాజాగా ఉత్తరాఖండ్ హైకోర్టు మాస్క్ ను ధరించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హైకోర్టు ఆవరణలోకి రావాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని నైనిటాల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ విపిన్ సింగ్ షాంఘ్వీ ఉత్తర్వులు ఇచ్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, శానిటైజర్ వాడటం వంటి కోవిడ్ జాగ్రత్తలను పాటించాలని తెలిపారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ నోటీసులు జారీ చేశారు.

Also Read...

మెట్రో ట్రాక్‌పై డ్రోన్ కలకలం


Next Story

Most Viewed