- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ రీ-ఎగ్జామ్‌లో పొరపాటు.. స్టూడెంట్‌కు అబుధాబిలో సెంటర్
నీట్ రీ-ఎగ్జామ్ కు అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకున్న విద్యార్థి.. అందులో వచ్చిన సెంటర్ పేరు చూసి షాకయ్యాడు.

దిశ, వెబ్‌డెస్క్: నీట్ రీ-ఎగ్జామ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. దేశవ్యాప్తంగా ఆదివారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జరగనున్న ఈ పరీక్షకు లక్షలాది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఓ అభ్యర్థికి ఊహించని పరిణామం ఎదురైంది. నీట్ రీ ఎగ్జామ్ కు అబ్దుల్లా మహమ్మద్ అనే విద్యార్థి శుక్రవారం సాయంత్రం అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేయగా.. అందులో పరీక్షా సెంటర్ అబుధాబిగా చూపించింది. దీంతో విద్యార్థి, అతని తల్లిదండ్రులు షాకయ్యారు. నాగ్ పుర్ కు చెందిన విద్యార్థికి అబుధాబి సెంటర్ గా పేర్కొనడంతో.. లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఆప్షన్లలో తాము అలాంటి సెంటర్ పేరే పెట్టలేదని విద్యార్థి తండ్రి వాపోయారు. దీనిపై హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేస్తే.. ఈరోజు సాయంత్రం 4 గంటలలోపు కొత్త అడ్మిట్ కార్డు జారీ చేస్తామని చెప్పారన్నారు.
తాము సెంటర్లను ఎంపిక చేసేటపుడు మూడు జిల్లాలను ఆప్షన్లుగా ఇచ్చామని, ఇప్పుడు మాత్రం నాగ్ పుర్ నే పరీక్షా కేంద్రంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సాయంత్రానికి మరో ప్రాంతంలో పరీక్షా సెంటర్ కేటాయిస్తే.. అక్కడికి చేరుకునేందుకు సమయం సరిపోదన్నారు. ఈ విషయమై తమ అబ్బాయి తీవ్ర ఆందోళనలో ఉన్నాడని ఆవేదన చెందారు. నీట్ ఎగ్జామ్ బాగా రాసినా.. పేపర్ లీక్ వల్ల ఆ కష్టమంతా వృథా అయిందని, ఇప్పుడేమో ఎగ్జామ్ సెంటర్లోనే పొరపాట్లు వచ్చాయన్నారు.
కాగా.. తాజాగా దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ అభిషేక్ సింగ్ స్పందించారు. విద్యార్థి పరీక్షా కేంద్రం కేటాయింపుపై తలెత్తిన సమస్యను పరిష్కరించామని, అతనికి నాగ్ పూర్ లోనే సెంటర్ కేయాటించామని తెలిపారు. నాగ్పూర్ విద్యార్థికి పరీక్ష కేంద్రం మార్పుపై ఎన్టీఏ స్పందించింది. అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయించిన విషయంపై స్పందించిన ఎన్టీఏ ఎన్టీఏ డీజీ అభిషేక్ సింగ్, విద్యార్థి పరీక్షా కేంద్రం సమస్యను పరిష్కరించామన్నారు. విద్యార్థికి నాగ్‌పూర్‌లోనే సెంటర్ కేటాయించామని తెలిపారు.
నేడు దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్ కు NTA మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. నీట్ రీ ఎగ్జామ్ లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా అధికారులు ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటల వరకూ ఈ మాక్ డ్రిల్ కొనసాగనుంది.






