- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nadda: త్వరలోనే ఆశా వర్కర్ల వేతనాలు పెంపు.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా
ఆశా కార్యకర్తల వేతనాలు పెంచాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మంగళవారం రాజ్యసభకు తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశ గ్రామీణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా కార్యకర్తలకు మెరుగైన వేతనాలు ఇవ్వాలని పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM), మిషన్ స్టీరింగ్ గ్రూప్ (MSG) ఆశా కార్యకర్తల వేతనాలు పెంచాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (Jp nadda) మంగళవారం రాజ్యసభకు తెలిపారు. పెరిగిన వేతనం త్వరలోనే వారికి అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తలు అట్టడుగు స్థాయిలో ఎంతో పని చేస్తున్నారని, మాతా, శిశు మరణాల రేటు తగ్గడంలో వారి కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రసూతి మరణాలను తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఆశా వర్కర్లు వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. ఎన్‌హెచ్ఎం, ఎంఎస్ జీ సంస్థలతో గత వారం జరిగిన సమావేశంలో ఆశా కార్మికుల ప్రోత్సాహకాలను పెంచాలని సిఫార్సు చేసిందని, ప్రభుత్వం దానిని ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.






