- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mysterious Deaths : కశ్మీర్ లో మిస్టరీ మరణాలు... బదాల్ లో కంటైన్మెంట్ జోన్లు
జమ్మూకశ్మీర్(JammuKashmir) లోని రాజౌరీ(Rajouri)లో 17 మంది మిస్టరీ మరణాలు(Mysterious Deaths) దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూకశ్మీర్(JammuKashmir) లోని రాజౌరీ(Rajouri)లో 17 మంది మిస్టరీ మరణాలు(Mysterious Deaths) దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. రాజౌరీలోని బదాల్(Badal) గ్రామంలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ఎలాంటి కారణం లేకుండా అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ మరణించిన వారంతా ఓ దినకర్మకు హాజరైన వారే కావడం.. ఎలాంటి వ్యాధి లేకుండా అకస్మాత్తుగా చనిపోవడంతో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బదాల్ లో ప్రత్యేక వైద్య బృందాన్ని, మొబైల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. ఆ మరణాలకు ఎలాంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు కారణం కాదని వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే స్పందించింది. మిస్టీరియస్ మరణాలు సంభవిస్తున్న 3 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారుల బృందం ఆయా గ్రామాలలో పర్యటించి మరణాలకు గల కారణాలను విశ్లేషించనున్నట్టు రాజౌరీ అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. కాగా మంగళవారం జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆ గ్రామాలను సందర్శించి, బాధిత కుటుంబాలను ఓదార్చారు. కాగా ఈ నెలరోజుల నుంచి ఈ అంతు చిక్కని మరణాలతో ఆయా గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్నారు.






