- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mysterious Deaths : కశ్మీర్లో మిస్టరీ మరణాలు.. వందలాది మంది క్వారంటైన్
జమ్ము కశ్మీర్లో(Jammu Kashmir) రాజౌరీ(Rajouri)లోని బదాల్(Badal) గ్రామంలో సంచలనం రేపుతున్న 17 మంది మిస్టరీ మరణాల(Mysterious Deaths) విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జమ్ము కశ్మీర్లో(Jammu Kashmir) రాజౌరీ(Rajouri)లోని బదాల్(Badal) గ్రామంలో సంచలనం రేపుతున్న 17 మంది మిస్టరీ మరణాల(Mysterious Deaths) విషయం తెలిసిందే. ఇప్పటికే బదాల్ ను 3 విభాగాలుగా కంటైన్మెంట్ జోన్లు(Containment Zones)గా ప్రకటించగా.. తాజాగా ఆయా గ్రామాలలోని వందలాది మంది ప్రజలను క్వారంటైన్ కేంద్రాలకు(Quarantain Centers) తరలించారు అధికారులు. 1వ కంటైన్మెంట్ జోన్లో మరణించిన వారి కుటుంబాలు ఉండగా, 2వ కంటైన్మెంట్ జోన్లో బాధిత కుటుంబాలకు సన్నిహితంగా మెలిగిన వారిని ఉంచారు. ఇక 3వ కంటైన్మెంట్ జోన్లో మిగిలిన గ్రామం మొత్తాన్ని ఉంచారు. వీరు తీసుకునే ఆహారం, నీరు, తిరగడం మీద ఆంక్షలు విధించారు. ఇక ఆయా కంటైన్మెంట్ జోన్లలోని ప్రజల్లో దాదాపు 200 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. అయితే 17 మంది మృతుల అందరిలో ఒకే విధమైన మెదడు, నాడీ సంబంధ అనారోగ్యాలను గుర్తించారు కేంద్ర ప్రత్యేక దర్యాప్తు బృందం. కాగా ఈ మిస్టరీ మరణాల వెనుక గల కారణాలపై 3 రోజుల నుంచి దర్యాప్తు కొనసాగుతోంది.






