- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mysterious death: జమ్మూ కశ్మీర్‌లో మిస్టరీ మరణాలు.. రాజౌరీలో ఎయిమ్స్ బృందం పర్యటన
జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఇటీవల పలువురు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లోని రాజౌరీ జిల్లాలో ఇటీవల పలువురు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ (Aiims) డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఆదివారం రాజౌరీలోని బధాల్ (Badhal) గ్రామాన్ని సందర్శించింది. ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్న11 మంది రోగులతో మాట్లాడి, వారి నమూనాలను సైతం సేకరించింది. ఈ బృందం మూసి వేసిన ఇళ్లు, మరణాలు సంభవించిన మూడు కుటుంబాల పరిసర ప్రాంతాల నుంచి నమూనాలను పరిశీలించనుంది. వైద్యులు 11 మంది రోగులకు అట్రోపిన్ అనే యాంటీ పాయిజన్ డ్రగ్‌ని ఉపయోగించి చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు.
కాగా, రాజౌరిలో ఇప్పటివరకు 17 మంది అనుమానాస్పదంగా మరణించారు. దీంతో 87 కుటుంబాలకు చెందిన 364 మందిని బధాల్ గ్రామం నుంచి రాజౌరిలోని మూడు వేర్వేరు కేంద్రాలకు తరలించారు. గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే గత 9 రోజులుగా గ్రామంలో కొత్త కేసులేవీ నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. ఎయిమ్స్ బృందంతో పాటు చండీగఢ్‌లోని నిపుణులతో కూడిన బృందం కూడా అనుమానాస్పద మరణాలకు గల కారణాన్ని పరిశీలిస్తున్నారు. ఎయిమ్స్ బృందంలో డాక్టర్ షరీఫ్, అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ అడిషనల్ డాక్టర్ శైలేంద్ర కుమార్, ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ జమ్‌హద్ నాయర్, పీడియాట్రిక్స్ అడిషనల్ ప్రొఫెసర్ జగదీష్ ప్రసాద్ ఉన్నారు.






