- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యటక ప్రాంతంలో అడవి మనుషులు.. ఎంత మందిని చంపేశారంటే..?
ఇప్పటికీ మనం కొన్ని ప్రాంతాల్లో అడవి మనుషుల తెగల గురించి, వారి జీవన విధానం గురించి వింటూనే ఉంటాం.

దిశ, వెబ్‌డెస్క్ : ఇప్పటికీ మనం కొన్ని ప్రాంతాల్లో అడవి మనుషుల తెగల గురించి, వారి జీవన విధానం గురించి వింటూనే ఉంటాం. కొన్ని తెగల వారు ప్రపంచంతో సంబంధాలు కలిగి ఉంటే మరికొన్ని తెగలు ప్రపంచంతో సంబంధాలు లేకుండా జీవిస్తున్నారు. వీరికి దుస్తులు, డబ్బులు, విద్యుత్, రోడ్డు రవాణా, ఇవేవీ తెలియవు. వేటాడటం, తిండిని సమకూర్చుకోవడం మాత్రమే ఆ తెగల వారికి తెలుసు. ఎవరైనా మనుషులు పొరపాటున వారు జీవిస్తున్న ప్రాంతానికి వెళ్లారో అంతే సంగతి. ఈ తెగల ప్రజలు మనుషుల్ని హత్య చేసినా కూడా భారత ప్రభుత్వం వారిని ఏమీ చేయలేదు ? మరి ఇంతటి దారుణంగా జీవిస్తుంది ఏ తెగకు చెందిన ప్రజలు. వారు ఏ ప్రాంతంలో జీవిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మన భారత దేశం పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు. అలాంటి పర్యాటక ప్రాంతాల్లో ఒక్కటే కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ & నికోబార్ దీవులు. ఈ ప్రాంతంలో చూడటానికి ఎంతో సుందరంగా, మనోహరంగా పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉత్తర సెంటినెల్ ద్వీపంగా పిలువబడే ఉష్ణమండల ద్వీపం ఉంది. ఈ ద్వీపం చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, అక్కడ అంత భయంకరమైన తెగల వారు జీవిస్తూ ఉంటారు. సుమారు 60 వేల సంవత్సరాల కాలం నాటి మానవ తెగకు ఈ ద్వీపం నిలయంగా మారింది. ఈ ద్వీపంలో 300 నుంచి 400 మంది సెంటినెలీస్ తెగ ప్రజలు ఉన్నట్లు అంచనా. వీరు బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవడం కానీ బయటి దేశాలపై దాడులు చేయడం కానీ చేయరు. ఈ తెగల వారిని గురించి తెలుసుకునేందుకు, వారిని కలిసేందుకు ప్రపంచంలో ఎంతో మంది ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన వారిలో ప్రాణాలను కూడా పోగొట్టుకున్న వారు ఉన్నారు.
సెంటినెలీస్ తెగకు చెందిన వారు బయట వ్యక్తులను చూస్తే చాలు వారిపై బాణాలను సంధిస్తారు. తాము నివసిస్తున్న ప్రాంతంలో బయటి ప్రజలను అస్సలు అనుమతించరు. ఈ క్రమంలోనే 2004లో భారత కోస్ట్ గార్డులపై, హెలికాప్టర్లపై బాణాలతో దాడి చేశారు. అలాగే 2006లో చేపల వేటకు వెళ్లిన భారతీయ మత్స్యకారులను, 2018లో అమెరికన్ క్రైస్తవ మత ప్రభోదకుడు జాన్ అలెన్‌ని సెంటినెలీస్ తెగ వారు అత్యంత దారుణంగా చంపేశారు. దీంతో భారత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. సెంటినెలీస్ తెగ వారు జీవించే ప్రాంతానికి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రాంత ప్రజలను కలవకూడదని ఆదేశించింది.






