- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mayanmar Earthquake : మయన్మార్ భూకంపం... భారత్ కీలక నిర్ణయం
మయన్మార్, బ్యాంకాక్ లో శుక్రవారం భారీ భూకంపం(Thailand Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : మయన్మార్, బ్యాంకాక్ లో శుక్రవారం భారీ భూకంపం(Thailand Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 103 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించగా.. వందలాది మంది గల్లంతైనట్టు తెలిపింది. వరుసగా మూడుసార్లు వచ్చిన భూకంప ధాటికి పలు ఎత్తైన భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద భారీగా ప్రజలు చిక్కుకు పోయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ భూకంపం నేపథ్యంలో, అక్కడి భారతీయ పౌరులకు సహాయం అందించేందుకు భారత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్(India Helpline)లను ఏర్పాటు చేసింది. ఈ సేవలు మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఉంచింది. భూకంపం వల్ల ఏర్పడిన అత్యవసర పరిస్థితుల్లో భారతీయులు తమ భద్రత, సహాయం కోసం ఈ హెల్ప్‌లైన్ నంబర్‌లను సంప్రదించవచ్చునని పేర్కొంది. హెల్ప్‌లైన్ వివరాలు : హెల్ప్‌లైన్ నంబర్ +95-9255412602. కాన్సులర్ సేవల కోసం [email protected] అలాగే మయన్మార్, బ్యాంకాక్ లో చిక్కుకున్న భారతీయులు ఎవరైనా భారత ఎంబసీని నేరుగా సంప్రదించవచ్చని తెలియజేసింది.






