- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా హృదయం దు:ఖంతో నిండిపోయింది.. ప్రధాని మోడీ ఎమోషనల్ కామెంట్స్
పహల్గాం ఉగ్రదాడితో తన హృదయం తీవ్ర దు:ఖంతో నిడిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం ఉగ్రదాడితో తన హృదయం తీవ్ర దు:ఖంతో నిడిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇవాళ ఆయన వారణాసిలోని కాశీ క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేశారు. 20వ విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 9.7 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లకుపైగా నగదును అధికారులు జమ చేశారు. మరోవైపు ప్రధాని ప్రసంగాన్ని ప్రకాశం జిల్లా వీరాయపాలెంలో రైతులతో కలిసి సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఎల్ఈడీలో వీక్షిస్తున్నారు. కాసేపట్లో ఆయన ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి సభలో మాట్లాడుతూ.. కాశీ వాసుల కోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత తాను కాశీకి రావడం ఇదే తొలిసారి అని కామెంట్ చేశారు. పహల్గాంలో 26 మంది అమాయక పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని.. తన హృదయం దు:ఖంతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాశీ విశ్వనాథుడు, ఆ మహాదేవుడి ఆశీర్వాదంతో ఉగ్రవాదులు, దాయాది దేశంపై ప్రతీకారం తీర్చుకన్నామని అన్నారు. ఇండియన్ ఆర్మీ డ్రోన్లు, మిసైళ్ల దెబ్బకు పాకిస్థాన్ వణికిపోయిందని కామెంట్ చేశారు. నేటికి ఆ దేశ ఎయిర్ బేస్‌లు అన్ని ఐసీయూ (ICU)లో పడి ఉన్నాయని సెటైర్లు వేశారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని మహాదేవ్ పాదాలకు, సిదూరం కోల్పోయిన మహిళలకు అంకితం చేస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు.
రైతు సంక్షేమానిక అహర్నిశలు కృషి చేస్తున్నాం..
రైతులు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ అన్నారు. అన్నదాతలకు చేయూతను ఇచ్చేందుకే తాము పీఎం కీసాన్ యోజన పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. దేశ వ్యాప్తంగా వేల గోదాములను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 3 కోట్ల మంది లక్‌పతి దీదీలను తయారు చేస్తున్నామని.. ఇప్పటికే కోటిన్నర మంది లక్‌పతి దీదీలుగా మారారని తెలిపారు. కానీ, అసత్యాలతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నేతలు పక్కదారి పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము అమలు చేసే పథకాలు రైతులకు అత్యంత ప్రజయోజనం చేకూరుస్తున్నాయని.. వారి కోసం తాజాగా మరో 21 వేల కోట్లు నిధులు విడుదల చేశామని తెలిపారు. అన్నదాతలను ఆదుకునేలా ఎన్డీఏ సర్కార్ అనేక పథకాలను తీసుకొచ్చిందని, వారి సంక్షేమం కోసం అహర్నిశలు పని చేస్తూనే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.






