ఆ ఒక్క సమాధానంతో నా అమెరికా టూర్ కల చెదిరింది : నెట్టింట్లో భారత కస్టమ్స్ అధికారి ఆవేదన

by Naga Rani Yarlagadda |

అమెరికా వెళ్లాలని చాలా మంది కలలు కంటుంటారు. స్టూడెంట్స్ హయ్యర్ స్టడీస్ కోసం, జాబర్స్.. ఎక్కువ శాలరీ కోసం, కొందరైతే కనీసం టూర్ అయినా వెళ్లి రావాలని ఆశిస్తుంటారు.

ఆ ఒక్క సమాధానంతో నా అమెరికా టూర్ కల చెదిరింది : నెట్టింట్లో భారత కస్టమ్స్ అధికారి ఆవేదన
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా వెళ్లాలని చాలా మంది కలలు కంటుంటారు. స్టూడెంట్స్ హయ్యర్ స్టడీస్ కోసం, జాబర్స్.. ఎక్కువ శాలరీ కోసం, కొందరైతే కనీసం టూర్ అయినా వెళ్లి రావాలని ఆశిస్తుంటారు. ఆ కోవకు చెందిన ఓ కస్టమ్స్ ఆఫీసర్.. మూడు నిమిషాల్లో అమెరికా వెళ్లాలన్న తన కల చెదిరిపోయిందంటూ.. నెట్టింట ఆవేదన వ్యక్తం చేశాడు. వీసా ఇంటర్వ్యూలో తాను చెప్పిన తప్పు ఆన్సరే ఇందుకు కారణమైందని వాపోయాడు.

భారత్ కు చెందిన ఒక కస్టమ్స్ ఆఫీసర్ అమెరికా పర్యటనకు వెళ్లేందుకు టూరిస్ట్ వీసాకు అప్లై చేసుకున్నాడు. వీసా ఇంటర్వ్యూకు వెళ్లినపుడు టూర్ లో వారి ప్లాన్స్ ఏంటో చెప్పమని అడిగారు. ఈ క్రమంలో టూర్ పూర్తయ్యాక తిరిగి భారత్ కు వెళ్తానని చెప్పడానికి బదులుగా లాస్ ఏంజిల్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తానని చెప్పారు. అంతే మూడు నిమిషాల్లోనే టూరిస్ట్ వీసా రిజెక్ట్ అయింది. తన బ్యాంక్ అకౌంట్లో రూ.50 లక్షల సేవింగ్స్, గవర్నమెంట్ జాబ్, సొంతిల్లు ఉన్నా.. టూరిస్ట్ వీసా ఇలా రిజెక్ట్ అయిందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే దుబాయ్, థాయిలాండ్ దేశాల పర్యటనకు వెళ్లాలని, అమెరికా వీసా రిజెక్ట్ అవ్వడంతో జపాన్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటానన్నారు. అందుకే వీసా ఇంటర్వ్యూల సమయంలో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లకు సూచించారు.

Next Story