China: భారత్ తో సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు

by Shamantha N |

భారత్, బీజింగ్(China and India) సంబంధాలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ(Chinese Foreign Minister Wang Yi) అభిప్రాయపడ్డారు.

China: భారత్ తో సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, బీజింగ్(China and India) సంబంధాలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ(Chinese Foreign Minister Wang Yi) అభిప్రాయపడ్డారు. బీజింగ్‌లో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ(Foreign Secretary Vikram Misri in Beijing).. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశం అయ్యారు. ఇరుదేశాలు పరస్పర మద్దతు, లక్ష్య సాధనలకు ప్రాధాన్యమివ్వాలని వాంగ్ యీ అన్నారు. పరస్పరం అనుమానాస్పద దృష్టితో చూడటం, దూరంగా ఉంచడం వల్ల ప్రయోజనం లేదన్నారు. గతేడాది బ్రిక్స్ సమావేశంలో జిన్‌పింగ్‌-మోడీ మధ్య జరిగిన సమావేశం తర్వాత పరిణామాల్లో వేగంగా మార్పులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ‘‘ ఇరు పక్షాలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఇద్దరూ ఒక్కొక్క అడుగు ముందుకేయాలి. మరిన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పరస్పరం సాధనకు మద్దతు ఇచ్చుకోవాలి. ఇరు దేశాల ప్రజల ప్రాథమిక ప్రయోజనాల ఆధారంగానే సంబంధాలు ఉంటాయి’’ అని వెల్లడించారు. చైనా-భారత్ సంబంధాల మెరుగుదల, అభివృద్ధి, ఇరుదేశాల ప్రజల ప్రాథమిక ప్రయోజనాలకు పూర్తిగా అనుగుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

చైనా ఉన్నతాధికారులతో భేటీ

ఆదివారం విక్రమ్‌ మిస్రీ బీజింగ్‌ చేరుకొన్నారు.ఆ తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఇంటర్నేషనల్‌ డిపార్ట్‌మెంట్‌ అధిపతి లూజియాన్‌చావ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుపక్షాలు ఒప్పందాల అమలుపై అభిప్రాయాలను పంచుకొన్నాయి. ఆ తర్వాత ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సన్‌ వీడాంగ్‌తో భేటీ అయ్యారు. ఇరుదేశాలకు చెందిన ఉన్నతాధికారులు ఒకే నెలలో రెండు సార్లు సమావేశం అయ్యారు. వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి నాలుగేళ్లుగా కొనసాగిన ఉద్రిక్తతలకు గతేడాది ఇరుదేశాలు ముగింపు పలికాయి.

Next Story