- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Muttaqi: అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ భారత పర్యటన రద్దు.. కారణమిదే ?
అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ఈ నెలలో భారత్‌లో పర్యటించాల్సి ఉండగా ఆ టూర్ రద్దు అయినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

దిశ, నేషనల్ బ్యూరో: అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ (Amir khan muttaqi) ఈ నెలలో భారత్‌లో పర్యటించాల్సి ఉండగా ఆ టూర్ రద్దు అయినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల ప్రకారం ఆయనపై ప్రయాణ నిషేధం ఉండటంతో ఇండియా పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలిపాయి. ముత్తాకీ సందర్శనకు మినహాయింపు లేకపోవడంతో వాయిదా పడినట్టు తెలుస్తోంది. అయితే ముత్తాకీ భారత పర్యటనపై విదేశాంగ ప్రతినిధిని రణధీర్ జైస్వాల్‌ను (Ranadeer Jaiswal) మీడియా ప్రశ్నించగా ఆయన దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.
అఫ్గాన్ ప్రజలతో భారత్‌కు సంబంధం ఉందని, అప్గాన్ ప్రజల ఆకాంక్షలకు మద్దతిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అఫ్గాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ముత్తాకీ పర్యటనపై త్వరలోనే అప్ డేట్ తెలియజేస్తామని చెప్పారు. ఒకవేళ ముత్తాకీ పర్యటన జరిగి ఉంటే తాలిబన్లు అధికారాన్ని చేపట్టాక ఇదే మొదటి తాలిబన్ మంత్రి పర్యటన అయి ఉండేది. కాగా, పలువురు తాలిబన్ కీలక నేతలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు విధించింది. దీని ప్రకారం.. వారు విదేశాల్లో పర్యటించాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.






