- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైంగిక సమానత్వాన్ని సిలబస్‌లో చేర్చాలి : సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పర్యావరణ శాస్త్రాన్ని ఒక అంశంగా బోధించడం మొదలు పెట్టారు. అదే విధంగా నైతిక విద్య (మోరల్ సైన్స్) కూడా పాఠశాల సిలబస్‌లో భాగం కావాలని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.

- పిల్లలకు పాఠశాలల్లో ఈ కాన్సెప్ట్ బోధించాలి
- స్త్రీ, పురుష సమానత్వం ఇండ్లలోనే ప్రారంభం కావాలి
దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక సమానత్వం అనే భావనను పాఠశాల సిలబస్‌లో భాగంగా చేయాలి. మహిళలో పురుషులు ఎలా ప్రవర్తించాలనే నైతికతను పాఠశాల శిక్షణలో భాగం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. 'నైతిక శిక్షణ, మర్యాదలను పాఠశాల సిలబస్‌లో భాగం చేయాలి. చాలా చిన్న వయసు నుంచే పాఠశాలలో దీనిని బోధించడానికి సరైన మాడ్యూల్ ఉండాలి. ఇప్పుడు పాఠశాలల్లో నైతిక విద్యను బోధించడం లేదు. కొన్ని పాఠశాలల పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి సబ్జెక్ట్ ఉండి ఉండొచ్చు. కానీ వేరే సబ్జెక్ట్ బోధించడానికి ఒక్కసారి దీన్ని రద్దు చేస్తుంటారు' అని జస్టిస్ బివి నాగరత్న అభిప్రాయపడ్డారు. కూతుళ్లు, కొడుకుల మధ్య సమానత్వం ఇంట్లనే ప్రారంభం కావాలి. కానీ స్త్రీ,పురుషుల మధ్య వివక్షను తల్లిదండ్రులే ఇంట్లో ప్రారంభిస్తారని చెప్పారు. తల్లిదండ్రులు తమ కొడుకుల కంటే కూతుర్లను నియంత్రించడం పైనే ఎక్కువ దృష్టి పెడతారని చెప్పారు. అత్యాచార కేసులు, మహిళలపై నేరాలు పెరగడానికి కారణం లింగ సమానత్వం గురించి ప్రాథమిక స్థాయిలో బోధించకపోవడమే అంటూ సీనియర్ న్యాయవాది అబాద్ పోండా వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.
మన దేశంలోని జనాభాలో 50 శాతం మంది మహిళలు తీవ్రమైన ఒత్తిడి, అభద్రతతో జీవిస్తున్నారు. మహిళల పట్ల ద్వేషం, అనాకరిక వైఖరి పెరిగిపోతోంది. ఇలాంటి వైఖరిని మార్చడానికి నైతికత, లింగ సమానత్వం వంటి విషయాలను చిన్నతనంలోనే బోధించాలని పిటిషనర్ పేర్కొన్నారు. కాగా, స్త్రీ వివాహం చేసుకున్న తర్వాత తన తల్లిదండ్రుల ఇంటికి లేదా తన అత్తామామల ఇంటికి చెందినది కాదంటూ ఇప్పటికీ సమాజంలో చాలా మంది నమ్ముతున్నారని జస్టిస్ నాగరత్న తెలిపారు. స్త్రీ స్వతంత్రురాలని ఆమెకు స్వంత వ్యక్తిత్వం, సమాజంలో గౌరవం అనేవి పురుషులతో సమానంగా లభించాలనే అవగాహనను పెంపొందించాలని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పర్యావరణ శాస్త్రాన్ని ఒక అంశంగా బోధించడం మొదలు పెట్టారు. అదే విధంగా నైతిక విద్య (మోరల్ సైన్స్) కూడా పాఠశాల సిలబస్‌లో భాగం కావాలని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.






