- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆలయంలో నమాజ్.. అడ్డుకున్న అర్చకులకు బెదిరింపులు
తమిళనాడులో ఓ ఆలయానికి వెళ్లిన ముస్లిం యువకుడు .. అక్కడే నమాజ్ చేయడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: హిందూ ఆలయాలకు ఇతర మతాలకు చెందినవారు కూడా వెళ్తుండటం మనలో చాలా మంది వివిధ సందర్భాల్లో చూసే ఉంటాం. వారు సాధారణంగానే దేవుడిని దర్శించుకుంటారు. అయితే తాజాగా.. తమిళనాడులో ఓ ఆలయానికి వెళ్లిన ముస్లిం యువకుడు .. అక్కడే నమాజ్ చేయడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుప్పూర్ - మంగళం రోడ్డులో సెంగుంతపురం వద్ద ఉన్న రాజ గణపతి ఆలయంలోకి అక్టోబర్ 26వ తేదీ సాయంత్రం పూచుకాడ్ కు చెందిన అజ్మల్ ఖాన్ (21) వెళ్లాడు. అక్కడ భక్తులు కూడా ఉన్నారు.
వారంతా చూస్తుండగానే ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా, వినాయకుడి విగ్రహానికి వెన్నుచూపించి మరీ నమాజ్ చేశాడు. గమనించిన ఆలయ అర్చకుడు నాగనాథన్, భక్తులు అతడిని అడ్డుకుని ఆలయంలో నుంచి బయటకు వెళ్లాలని సున్నితంగా చెప్పారు. ససేమిరా వెళ్లేది లేదంటూ గొడవకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భక్తులంతా కలిసి అతడిని బయటకు పంపగా.. ఆలయం వెలుపల సైతం అతను వాగ్వాదానికి దిగాడు.
ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు అజ్మల్ ను అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని, అందుకే ఇలా ప్రవర్తించాడని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుపుతామని, పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.






