- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిందు యువకుడిని పెళ్లాడిన ముస్లిం యువతి.. కానీ చివరికి షాకింగ్ నిర్ణయం!
పశ్చిమ బెంగాల్‌లోని బర్దమాన్ జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) బర్దమాన్ జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ముస్లిం యువతి సుల్తానా పార్విన్ (Sultana Parvin), హిందూ యువకుడు ప్రితమ్ నందిని (Pritam Nandi) ప్రేమించింది. వారి పెళ్లికి పెద్దలు నిరాకరించటంతో సాథి నందిగా పేరు మార్చుకుని హిందూ మతాన్ని స్వీకరించి అతడిని పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లి విషయం తెలుసుకున్న సుల్తానా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె అన్నయ్య సబీర్ ఉద్దీన్ అహ్మద్ (గోల్సీ-2 బ్లాక్ టీఎంసీ అధ్యక్షుడు) తీవ్రంగా స్పందించారు. తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి, ప్రితమ్, అతని కుటుంబంపై కిడ్నాప్ కేసును నమోదు చేయించారు.
ఈ ఆరోపణలతో భయపడిన జంట చెన్నైకు పారిపోయింది. అక్కడ కొన్ని నెలలు గడిపిన తర్వాత, న్యాయస్థానంలో హాజరయ్యారు. తన ఇష్టంతో పెళ్లి చేసుకున్నట్టు కోర్టులో సుల్తానా వెల్లడించటంతో వారిపై పోలీసులు కేసు క్లోజ్ చేశారు. అనంతరం వారు తిరిగి పశ్చిమ బెంగాల్ వచ్చి, ప్రితమ్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. కానీ, ఆమెపై పుట్టింటి వేధింపులు మాత్రం ఆగలేదు. మతమార్పు పై విమర్శలతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయింది. భవిష్యత్తుపై భయం, కుటుంబ మద్దతు లేకపోవడం, చివరికి ఈ బాధలు తట్టుకోలేక సాథి నంది ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రేమ, స్వేచ్ఛ, మతాంతర వివాహంపై మతపరమైన ద్వేషాన్ని ప్రశ్నించే ఘటనగా ఇది నిలిచింది.






