Musk: బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ యూటర్న్.. ట్రంప్‌పై ప్రశంసలు

by B.Srinivas |

బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.

Musk: బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ యూటర్న్.. ట్రంప్‌పై ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బిగ్ బ్యూటిఫుల్ బిల్లు (Big beautyful bill) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ (Elon musk) మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిణామం జరిగిన మరుసటి రోజే ట్రంపుపై మస్క్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ వివాదాలను పరిష్కరించడంలో ట్రంప్ విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. క్రెడిట్ ఇవ్వాల్సిన చోట క్రెడిట్ ఇవ్వాలని, ప్రపంచవ్యాప్తంగా అనేక తీవ్రమైన సంఘర్షణలను ట్రంప్ విజయవంతంగా పరిష్కరించారని పేర్కొన్నారు.

గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటన చేసిన కాసేపటికే మస్క్ ప్రశంసలు కురిపించారు. కాగా, ట్రంప్, మస్క్ లు గతంలో సన్నిహితులుగా ఉండేవారు. ఎన్నికల్లోనూ ట్రంపునకు మస్క్ మద్దతిచ్చారు. అయితే తాజాగా ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రంగా మాటల యుద్ధం కొనసాగించారు.

Next Story