- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
White House: డోజ్ లో మస్క్ హెడ్ కాదు.. ఎంప్లాయ్ కాదు
ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పై వైట్ హౌజ్ కీలక వ్యాఖ్యలు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పై వైట్ హౌజ్ కీలక వ్యాఖ్యలు చేసింది. తాత్కాలికంగా ఏర్పాటైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE)లో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించింది. దీనిపై అమెరికా అధ్యక్ష కార్యాలయం (White House) మరోసారి క్లారిటీ ఇచ్చింది. డోజ్‌లో మస్క్ ఎంప్లాయ్ కాదు. డోజ్ హెడ్ కూడా కాదు. ట్రంప్ సలహాదారుడిగా ఆ బాధ్యత చూస్తున్నాడు. ఆయనకు ఎటువంటి నిర్ణయాధికారాలు లేవని స్పష్టం చేసింది. ‘‘మస్క్ యూఎస్ డోజ్ సర్వీస్ ఉద్యోగి కాదు. వైట్‌హౌస్‌లో ఇతర సీనియర్ సలహాదారుల మాదిరిగానే స్వతహాగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే అధికారం మస్క్‌కు లేదు’’ అని కోర్టు ఫైలింగ్‌లో వైట్‌హౌస్ వ్యవహారాల డైరెక్టర్ జోషువా ఫిషర్ పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ న్యూ మెక్సికో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసుకు సంబంధించి వైట్‌హౌస్ ఈ వివరణ ఇచ్చింది.
డోజ్ ఏర్పాటు
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పాటైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) శాఖకు ఎలాన్ మస్క్‌ను సారథిగా నియమించారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, శాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా డోజ్ పని చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వివిధ శాఖల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ట్రంప్ యంత్రాంగాన్ని ఎలాన్ మస్క్ వెనకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో, డోజ్‌కు సంబంధించి అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఫెడరల్ ఏజెన్సీలు డోజ్‌తో సంప్రదింపులు చేసిన తర్వాతే ఉద్యోగుల తొలగింపు, నియామకాలపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే వైట్ హౌజ్ స్పందించింది. మస్క్ విధాన విషయాలపై ట్రంప్‌కు సలహా ఇస్తున్నప్పటికీ, ప్రభుత్వ నిర్ణయాలను స్వతంత్రంగా అమలు చేయడానికి అతనికి అధికారిక అధికారం లేదని వైట్ హౌజ్ పేర్కొంది.






