సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం.. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత

by Prasad Jukanti |   (  Updated:2026-04-12 07:41:20  IST  )

లెజెండరీ సింగర్, పద్మ విభూషణ్ గ్రహీత ఆశా భోంస్లే కన్నుమూశారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆమె తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.

సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం.. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారతీయ సంగీత శిఖరం, లెజెండరీ సింగర్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహిత సింగర్ ఆశా భోస్లే(92) (Asha Bhosle) కన్నుమూశారు. కొద్దిరోజులుగా తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆశా భోస్లేను ఆమె కుటుంబ సభ్యులు నిన్న ముంబయి లోని బ్రీచ్ క్యాండీ (Breach Candy Hospital) ఆసుపత్రికి తరలించారు. అక్క వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆదివారం ఉదయం మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె అంత్యక్రియలు రేపు సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్‌లో జరగనున్నాయి.

తన గాత్రంతో కట్టిపడేసి:

భారత‍రత్న లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశాభోస్లే 1943లో మరాఠీ చిత్రంతో గాయనిగా ఎంట్రీ ఇచ్చారు. 70 ఏళ్ల సినీ ప్రస్థానంలో 20 భాషల్లో 12 వేలకు పైగా పాటలు పాటి శ్రోతలను అలరించారు. తనదైన గాత్రంతో యావత్ భారతాన్ని ఉర్రూతలూగించిన ఆశా భోస్లే తన కెరీర్‍లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. వేలకొద్దీ పాటలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన ఆమెకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. తన గాత్రంతో అలరించిన ఆశాభోస్లే మరణంతో సినిమా, సంగీత ప్రపంచంలో విషాదచాయలు అలుముకోగా, ఆమె మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Next Story