- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Murmu: సాయుధ దళాల ధైర్య సాహసాలు భేష్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు భేటీ అయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi murmur) తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ (Anil chowhan), త్రివిధ దళాల అధిపతులు బుధవారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ సమావేశం జరగగా పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వివరాలను అధికారులు ముర్ముకు వివరించారు. ఈ మేరకు ప్రెసిడెంట్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘రాష్ట్రపతి ముర్ముతో సీడీఎస్ సహా త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేశారు. ఆపరేషన్‌కు ముందస్తు ప్రణాళిక దాని అమలు తీరుపై వివరించారు. ఆ తర్వాత భారత సాయుధ దళాల ధైర్యాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు. వారి అద్బుతమైన ప్రదర్శనకు అభినందనలు తెలిపారు’ అని పేర్కొంది. రాష్ట్రపతితో సమావేశమైన వారిలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠిలు ఉన్నారు.
కాగా, ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరిట దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ పాకిస్థాన్ ల మధ్య ఉద్రక్తతలు నెలకొనగా కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఇరు వైపులా శాంతియుత వాతావరణం నెలకొంది. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని సైన్యం తెలిపింది. పాకిస్తాన్ చేసిన అన్ని దాడులను భారత వైమానిక దళం తిప్పికొట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రపతితో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు.






