- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Murmu: రేపు మహాకుంభమేళాకు రాష్ట్రపతి ముర్ము.. భారీగా బలగాల మోహరింపు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ నగరంలో జరుగుతున్న మహాకుంభమేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం సందర్శించనున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ (Prayag raj) నగరంలో జరుగుతున్న మహాకుంభమేళా (Maha khumbamela)ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi murmu) సోమవారం సందర్శించనున్నారు. పూజా కార్యక్రమాలతో పాటు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయనున్నారు. ఎనిమిది గంటలకు పైగా కొనసాగే తన పర్యటనలో రాష్ట్రపతి మహా కుంభమేళా గొప్పతనాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలుసుకోనున్నారు. ముర్ముతో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi aadityanath) కూడా పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరం అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా బలగాలను మోహరించారు. కాగా, గతంలో దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా మహా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.
మరోవైపు ఆదివారం సెలవు దినం కావడంతో మహా కుంభమేళాలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో జాతరకు వెళ్లే దారిలో సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నెలకొంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మహా కుంభమేళాను సందర్శించి పవిత్ర స్నానం చేశారు. దీంతో గత నెల నుంచి మహాకుంభమేళాకు హాజరైన భక్తుల సంఖ్య 42కోట్లకు చేరుకుంది. ఈ నెల 26 వరకు జాతర కొనసాగనుంది.






