బాలికపై హత్యాచారం.. దోషికి బహిరంగ మరణశిక్ష

by Yella Dhawani Reddy |

బాలికపై దారుణమైన అత్యాచారం చేసి, ప్రాణాలు తీసిన దోషికి కోర్టు సంచలన శిక్ష విధించింది.

బాలికపై హత్యాచారం.. దోషికి బహిరంగ మరణశిక్ష
X

దిశ, వెబ్ డెస్క్: బాలికపై దారుణమైన అత్యాచారం చేసి, ప్రాణాలు తీసిన దోషికి కోర్టు సంచలన శిక్ష విధించింది. ఇకపై ఇలాంటి పాశవిక చర్యలు చేసేందుకు ఎవ్వరూ ధైర్యం చేయకుండా చూడాలని, ఆ వ్యక్తికి బహిరంగంగా ఉరిశిక్ష అమలు చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. ఇరాన్ (Iran) దక్షిణ ప్రాంతంలోని బుకాన్‌కు చెందిన ఓ బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో ఓ వ్యక్తి దోషిగా తేలాడు. బాలికపై జరిగిన అఘాయిత్యానికి న్యాయం చేయాలని బాధిత కుటుంబం, ప్రజల నుంచి పెద్దఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. వారి ఆకాంక్ష మేరకే, ఈ దారుణానికి పాల్పడిన దోషికి మార్చి నెలలోనే మరణశిక్ష ఖరారు చేయగా, సుప్రీంకోర్టు కూడా దానిని మద్దతు తెలిపింది.

"ఇది కేవలం నేరం కాదు, ఓ కుటుంబాన్ని చీకటిలో నెట్టిన సంఘటన," అని న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ, ఈ కేసులో భావోద్వేగాలకు గౌరవం ఇవ్వాలని, అందుకే బహిరంగంగా శిక్షను అమలు చేశామని స్పష్టం చేశారు.

ఇరాన్‌లో ఇటువంటి కేసుల్లో బహిరంగ మరణశిక్షలు అనేది చాలా సాధారణమైనది. హత్య, అత్యాచారం వంటి ఘోర నేరాలకు సంబంధించి ప్రజలలో భయం, భద్రతా భావం కలిగించాలనే ఉద్దేశంతో ఇటువంటి చర్యలు తీసుకుంటారు. మానవ హక్కుల సంఘాల ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా మరణశిక్షలు అమలు చేసే దేశాల్లో ఇరాన్‌ రెండవ స్థానంలో నిలిచింది. మొదటిది చైనా.

Next Story