Madhya Pradesh : మూడో భార్య చెప్పిందని.. మొదటి భార్య కుమారుడిని చంపిన తండ్రి

by Hajipasha |
Madhya Pradesh : మూడో భార్య చెప్పిందని.. మొదటి భార్య కుమారుడిని చంపిన తండ్రి
X

దిశ, నేషనల్ బ్యూరో : మూడో భార్య మాటలు విని.. మొదటి భార్య వల్ల కలిగిన కొడుకును చేతులారా ఓ తండ్రి చంపుకున్నాడు. ఆరేళ్ల కుమారుడిని గొంతు నులిమి చంపడాన్ని వీడియో తీసి మరీ.. మూడో భార్యకు పంపాడు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని ఇండోర్(Indore) నగరం పరిధిలో ఉన్న తేజాజీ నగర్ ఏరియాలో 2023 సంవత్సరం మే 14న చోటుచేసుకుంది. రాక్షసంగా ప్రవర్తించిన తండ్రి శశిపాల్ ముండేకు, అమాయక బాలుడు ప్రతీక్‌ను చంపితే కానీ పుట్టింటికి రానని దారుణమైన షరతు పెట్టిన పినతల్లి మమత అలియాస్ పాయల్‌కు ఇండోర్‌లోని సెషన్స్ కోర్టు జీవితఖైదు శిక్షను విధించింది. వారిపై చెరో రూ.లక్ష జరిమానా కూడా విధించింది.

కేసు విచారణలో ఉన్న తరుణంలో ఈ హత్యకు పాల్పడిన శశిపాల్ మూడో భార్య మమత అలియాస్ పాయల్‌కు ఒక శిశువు కలిగాడు. తల్లి మమత జీవితఖైదు(life imprisonment) శిక్షను అనుభవించాల్సి ఉన్నప్పటికీ.. ఆమె శిశువుకు నేరంతో సంబంధం లేనందున, అతడి పెంపకానికి, విద్యకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రుల నేర ప్రవృత్తి ప్రభావం ఆ శిశువుపై పడకుండా చూడాలని నిర్దేశించింది. అక్టోబరు 22న ఈమేరకు తీర్పును వెలువరించింది.

Advertisement

Next Story

Most Viewed