- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ చైర్మన్ దారుణ హత్య
పట్టపగలే, నగరం నడిబొడ్డున ఉన్న పార్టీ ఆఫీసులోనే ఓ మున్సిపల్ చైర్మన్ దారుణ హత్యకు గురయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : పట్టపగలే, నగరం నడిబొడ్డున ఉన్న పార్టీ ఆఫీసులోనే ఓ మున్సిపల్ చైర్మన్ దారుణ హత్యకు గురయ్యారు. శ్రీలంకలోని వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్ లసంత విక్రమశేఖర బుధవారం ఉదయం తన ఆఫీసులో ప్రజా సమస్యలు వింటున్న సమయంలో ఇద్దరు దుండగులు ఆఫీస్‌లోకి చొరబడ్డారు. తమ వద్ద ఉన్న గన్‌తో విక్రమశేఖర (Lasantha Wickramasekara)పై కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన విక్రమశేఖరను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. దుండగుల కోసం గాలిస్తున్నామని, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
సీసీటీవీ ఫుటేజిలో దుండగులు ఆఫీసులోకి చొరబడి కాల్పులు జరిపిన దృశ్యాలు బయటికి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వెలిగామా కౌన్సిల్ నియంత్రణపై అధికార పార్టీ 'నేషనల్ పీపుల్స్ పవర్', ప్రతిపక్ష ఎస్‌జేబీ మధ్య తీవ్ర పోటీ, వివాదాలు ఉన్న నేపథ్యంలో ఈ హత్య జరగడం సంచలనం రేపింది. రాజకీయ ఉద్రిక్తతలకు, అల్లర్లకు దారితీయకుండా పలు ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.






