- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం.. ప్రియుడికి సహకరించిన తల్లి
మానవత్వానికే కాదు.. అమ్మతనానికే మాయని మచ్చ ఈ ఘటన. కన్నకూతుర్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే.. తన ప్రియుడితో అత్యాచారానికి సహకరించింది. రెండున్నరేళ్ల కుమార్తెపై ప్రియుడు దారుణానికి తెగబడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి.. సపోర్ట్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: మానవత్వానికే కాదు.. అమ్మతనానికే మాయని మచ్చ ఈ ఘటన. కన్నకూతుర్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే.. తన ప్రియుడితో అత్యాచారానికి సహకరించింది. రెండున్నరేళ్ల కుమార్తెపై ప్రియుడు దారుణానికి తెగబడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి.. సపోర్ట్ చేసింది. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలోని (Maharashtra Rape Case) మల్వానీ ప్రాంతంలో వెలుగు చూసింది. ఈ దారుణంపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మల్వానీ ప్రాంతానికి చెందిన మహిళ (30) గర్భిణీగా ఉన్నప్పుడే తన భర్తతో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆ తర్వాత ఆమెకు 19 ఏళ్ల యువకుడితో ఏర్పడిన పరిచయం శారీరక సంబంధానికి దారితీసింది. ప్రస్తుతం ఆమెకు రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. ఆదివారం (మే 18) రాత్రి కూతురితో నిద్రపోతున్న మహిళ ఇంటికి వచ్చిన ప్రియుడు.. విచక్షణ లేకుండా చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పాపం చిన్నారి.. ఆ ఘటనతో ప్రాణం విడిచింది. ఈ దారుణాన్ని ఆపాల్సిన తల్లి.. అతడికి సహకరించింది. ఆ తర్వాత తన కూతురికి మూర్ఛ వచ్చిందని అందరినీ నమ్మించి.. మల్వానీ జనకల్యాణ్ నగర్లో ఉన్న జనరల్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లకు కూడా మూర్ఛ వచ్చి పడిపోయిందనే చెప్పగా.. అప్పటికే చిన్నారి మరణించిందని వైద్యులు నిర్ధారించారు.
పాప మృతదేహానికి పరీక్షలు చేస్తున్న డాక్టర్లు.. ప్రైవేట్ భాగాలపై గాయాలున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. అక్కడికి వెళ్లిన పోలీసులు తల్లిని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలివ్వడంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. అత్యాచారం తర్వాత పరిస్థితి చేయిదాటిపోవడంతో మూర్ఛ నాటకం ఆడారని తేల్చారు. ఇద్దరిపై పోక్సో (Pocso Act) చట్టం సెక్షన్లు 6, 10, 21 కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.






