- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Local Train Accident : ముంబై రైలు ప్రమాదం.. సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం
మహారాష్ట్ర(Maharashtra)లోని ముంబ్రా(Mumbra)లో లోకల్ ట్రైన్ (Local Train Accident) నుంచి పట్టాలపై పడి ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర(Maharashtra)లోని ముంబ్రా(Mumbra)లో లోకల్ ట్రైన్ (Local Train Accident) నుంచి పట్టాలపై పడి ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సెంట్రల్ రైల్వే(Indian Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్ని సబర్బన్ రైళ్లలో ఆటోమేటిక్ డోర్ క్లోజ్ సిస్టమ్(Autometic Door Close System) ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. అయితే ముంబై లోకల్ ట్రైన్ ప్రమాదాల్లో కనీసం రోజుకు ఏడుగురు చొప్పున ప్రాణాలు విడుస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ముంబై లోకల్ ట్రైన్లో(Mumbai Local Trains) ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో.. ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారు ప్రమాదకరంగా ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తుంటారు.
నేడు కూడా ఇలా ప్రయాణిస్తుండగా పట్టును కోల్పోయి రైలు పట్టాలపై పడిపోయారు. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు చనిపోగా మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అన్ని లోకల్ ట్రైన్లకు ఆటోమేటిక్ డోర్ క్లోజ్ సిస్టమ్ తీసుకు రానుంది.






