- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరెంట్ కోతలతో అల్లాడుతున్న ముంబై.. బీచ్‌లో ఆరుబయట నిద్రిస్తున్న కుటుంబాలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వరుస విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Power Cuts in mumbai) మహారాష్ట్ర రాజధాని ముంబైలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వరుస విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భరించలేని ఉక్కపోత, కరెంట్ లేకపోవడంతో జనం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు స్థానికులు ఏకంగా సముద్ర తీరాల్లో (బీచ్‌లలో) ఆశ్రయం పొందుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వెర్సోవా బీచ్ పరిసరాల్లోని మురికివాడల ప్రజలు ఇళ్లలో ఉండలేక రాత్రిపూట బీచ్ ఇసుకలో చాపలు వేసుకుని నిద్రిస్తున్నారు. ఇరుకైన ఇళ్లు, సరైన గాలి వెలుతురు రాని రేకుల షెడ్లు కావడంతో వేడి తీవ్రతకు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. దీనికి తోడు కరెంట్ కోతలు కూడా తోడవడంతో.. చల్లటి సముద్రపు గాలి కోసం కుటుంబాలకు కుటుంబాలు రాత్రికి బీచ్‌కు చేరుకుని, తెల్లవారగానే తిరిగి తమ ఇళ్లకు వెళ్తున్నారు. ప్రస్తుతం వందలాది మంది ఇలా బీచ్‌లో నిద్రిస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
విద్యుత్ కోతలకు కారణం ఇదే..
తీవ్రమైన ఎండలు, ఏసీలు-కూలర్ల వాడకం విపరీతంగా పెరగడం, వేగవంతమైన పట్టణీకరణ తదితర కారణాల వల్ల ముంబైలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. మౌలిక సదుపాయాలపై అదనపు భారం పడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తోంది. గంటల తరబడి కరెంట్ పోతుండటంతో కొన్ని చోట్ల ప్రజలు నిరసనలకు సైతం దిగుతున్నారు.






