Mumbai: వెబ్ సైట్ లో సూసైడ్ లెటర్ పోస్టు చేసి వ్యక్తి ఆత్మహత్య

by Shamantha N |

కంపెనీ వెబ్ సైట్ లో తన చావుకి భార్యే కారణమంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Mumbai:  వెబ్ సైట్ లో సూసైడ్ లెటర్ పోస్టు చేసి వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, నేషనల్ బ్యూరో: కంపెనీ వెబ్ సైట్ లో తన చావుకి భార్యే కారణమంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని హోటల్ గదిలో నిశాంత్ త్రిపాఠి(Nishant Tripathi) అనే వ్యక్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. త్రిపాఠి అతడు ఇటీవల ముంబైలోని ఒక హోటల్‌లో దిగారు. చనిపోవడానికి ముందు తన గదికి ‘డు నాట్ డిస్టర్బ్’ అనే బోర్డు బయట తగిలించి ఉంచారు. దాంతో సిబ్బంది అటువైపుగా వెళ్లలేదు. కానీ ఎంతకీ అతడు గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తమవద్ద ఉన్న తాళం చెవితో గది తలుపులు తెరిచారు. అలాగే పోలీసులకు సమాచారం అందించారు. కానీ అప్పటికే నిశాంత్ మరణించారు. చనిపోవడానికి ముందు తన కంపెనీ వెబ్‌సైట్‌లో సూసైడ్ నోట్‌ను షేర్ చేశారు.

లేఖలో ఏముందంటే?

సూసైడ్ లెటర్ లో నిశాంత్ తన భార్య పట్ల తనకున్న ప్రేమను వ్యక్తంచేశారు. భార్యతో పాటు ఆమె తల్లి తన చావుకు కారణమని పేర్కొన్నారు. అందులో.. ‘‘నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నేను ఈ లోకంలో ఉండను. మనిద్దరి మధ్య జరిగిన అన్నింటికి నేను నిన్ను ద్వేషించాలి. కానీ, నేను ద్వేషాన్ని కాదు.. ప్రేమనే ఎంచుకుంటా. అప్పుడు, ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నే ఉంటా. మీ ఇద్దరి వల్ల నేను పడిన వేదనంతా నా తల్లికి తెలుసు. మీరు ఎప్పటికీ నా తల్లని కలవొద్దు. ఇదే నా కోరిక. ఇప్పటికే ఆమె చాలా బాధ పడింది. నా తల్లిని ప్రశాంతంగా అయినా బాధ పడనివ్వండి’’ అని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. నిశాంత్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు. నిశాంత్ తల్లి నీలం చతుర్వేది.. ఒక మహిళా హక్కుల కార్యకర్త. తన కుమారుడి మరణంపై తీవ్ర ఆవేదనకు గురైన ఆమె.. సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ఇంక నాకు జీవితమే లేదు. ఇప్పుడు నేనొక జీవచ్ఛవాన్ని. నా బిడ్డ నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయాడు’’ అని రాసుకొచ్చారు. మృతుడి తల్లి దీనిపైనే కేసు నమోదు చేయగా.. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి అరెస్టులు జరగలేదు.

Next Story