- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mumbai High Court: ముంబై రైలు పేలుళ్ల కేసు.. హైకోర్టు సంచలన తీర్పు
ముంబై (Mumbai)లోని సబ్ అర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లో 2006, జూలై 11న జరిగిన బాంబు పేలుళ్లు కేసులో ముంబై హైకోర్టు (Mumbai High Court) సంచలన తీర్పును వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: ముంబై (Mumbai)లోని సబ్ అర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లో 2006, జూలై 11న జరిగిన బాంబు పేలుళ్లు కేసులో ముంబై హైకోర్టు (Mumbai High Court) సంచలన తీర్పును వెలువరించింది. కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మందిని నిర్దోషులు ప్రకటిస్తున్నట్లుగా జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్ ధర్మాసనం వెల్లడించింది. ప్రాసిక్యూషన్ ఆరోపణలను నిరూపించడంలో విఫలమైందని, ఆధారాలలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. సాక్షుల వాంగ్మూలాలు, అదేవిధంగా ఇతర ఆధారాలు నమ్మదగినవిగా లేవని వ్యాఖ్యానించారు. దీంతో, ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్ష, జీవిత ఖైదు శిక్షలను రద్దు చేస్తూ 12 మంది ఆరోపితులను నిర్దోషులుగా బెంచ్ ప్రకటించింది.
కాగా, 2006లో ముంబయిలోని మాటుంగా రోడ్, బాంద్రా, ఖార్ రోడ్, జోగేశ్వరి, బోరివలి, మీరా రోడ్, మరియు మహిమ్ రైల్వే స్టేషన్లలో సాయంత్రం 6.24 నుంచి 6.35 గంటల మధ్య మొత్తం వేర్వేరు ప్రాంతాల్లో ఏడు చోట్ల వరుసగా బాంబ్ బ్లాస్ట్‌లు సంభవించాయి. అయితే, ఈ దాడులు ఫస్ట్-క్లాస్ రైలు కంపార్ట్‌మెంట్‌లలో రద్దీగా ఉన్న సమయంలో సంభవించగా.. మొత్తం 189 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడులకు లష్కర్-ఎ-తోయిబా (Lashkar-e-Taiba), స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (Students Islamic Movement of India) సంస్థలతో సంబంధం ఉన్నాయని పోలీసులు ఆరోపించారు.






