Mumbai: ముంబైలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

by B.Srinivas |

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని ముంబైతో సహా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్థంభించింది.

Mumbai: ముంబైలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని ముంబైతో సహా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్థంభించింది. రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగింది. విఖ్రోలిలోని పార్క్‌సైడ్‌లో కొండచరియలు విరిగిపడగా ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి శనివారం ఉదయం 5 గంటల మధ్య పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. విఖ్రోలిలో అత్యధికంగా 257.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ కాగా.. ఠాగూర్ నగర్‌లో 213, మరోల్‌లో 216 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ముంబైతో సహా ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మొదట ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఆ తర్వాత దానిని అప్ గ్రేడ్ చేసింది.

Next Story