Mumbai airport: ముంబై ఎయిర్ పోర్టుకు మరోసారి బెదిరింపులు.. వారంలో ఇది రెండోసారి

by Shamantha N |

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. మంగళవారం ముంబై పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది.

Mumbai airport: ముంబై ఎయిర్ పోర్టుకు మరోసారి బెదిరింపులు.. వారంలో ఇది రెండోసారి
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. మంగళవారం ముంబై పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే అధికారులు భద్రతను పెంచారు. బాంబు స్క్వాడ్ బృందాలు, అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టారు. అయితే, అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పేర్కొన్నారు.

వరుసగా రెండోసారి..

కాగా.. ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం వారంలో ఇది రెండోసారి. మే 17న ఎయిర్ పోర్టు, ఐకానిక్ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ కు పేలుళ్ల హెచ్చరికలు వచ్చాయి. పేలుళ్ల హెచ్చరికతో పోలీసులకు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. 2001 పార్లమెంట్ దాడి సూత్రధారి అఫ్జల్ గురు మరణశిక్ష అన్యాయమని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ నెల ప్రారంభంలో మహారాష్ట్ర సచివాలయానికి కూడా బాంబు పేలుడు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. మరోవైపు, మే 7న ఇండిగో విమానంలో (6E 6382) పేలుడు పదార్థం ఉందని కాల్ వచ్చింది. ఆ తర్వాత అది మోసమని తేలింది. పహెల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఉద్రిక్తతల వేళ ముంబైలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఇలాంటి వేళ వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి.

Next Story