సింగపూర్‌లో బహుళజాతి జలాంతర్గామి రక్షణ వ్యాయామం పసిఫిక్ రీచ్ 2025.. కీలక పాత్ర పోషిస్తున్న భారత్

by Malleboina Mahesh |

సింగపూర్‌లో జరుగుతున్న బహుళజాతి జలాంతర్గామి రక్షణ వ్యాయామం పసిఫిక్ రీచ్ 2025 లో భారత నావికాదళం (Indian Navy) కీలక పాత్ర పోషిస్తోంది.

సింగపూర్‌లో బహుళజాతి జలాంతర్గామి రక్షణ వ్యాయామం పసిఫిక్ రీచ్ 2025..  కీలక పాత్ర పోషిస్తున్న భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: సింగపూర్‌లో జరుగుతున్న బహుళజాతి జలాంతర్గామి రక్షణ వ్యాయామం పసిఫిక్ రీచ్ 2025 లో భారత నావికాదళం (Indian Navy) కీలక పాత్ర పోషిస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి 29 వరకు జరిగే ఈ డ్రిల్‌లో 40 కంటే ఎక్కువ దేశాలు పాల్గొంటున్నాయి. భారతదేశం తరఫున INS Nistar అనే ఆత్మనిర్భర్ నౌక, సబ్మరిన్ రెస్క్యూ యూనిట్ (East) తో కలిసి పాల్గొంటున్నాయి. ఇందులో లోతైన సముద్రంలో డైవింగ్, రెస్క్యూ కార్యకలాపాల్లో భారత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ వ్యాయామం రెండు దశల్లో జరుగుతుంది. హార్బర్ దశలో సాంకేతిక చర్చలు, నిపుణుల అనుభవ మార్పిడి, వైద్య సదస్సులు, నౌకల పరస్పర సందర్శనలు ఉంటాయి. అలాగే సముద్ర దశలో ప్రత్యక్ష రక్షణ విన్యాసాలు, సబ్మరిన్ రెస్క్యూ drillలు నిర్వహించబడతాయి. దీని ద్వారా భాగస్వామ్య దేశాలు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను మెరుగుపరుచుకోవడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో పరస్పర సహకారం, సమన్వయం బలోపేతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతాయి. భారత నావికాదళానికి ఇది అంతర్జాతీయ స్థాయిలో తన సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి, భవిష్యత్తు సముద్ర రక్షణ సవాళ్లను ఎదుర్కొనేందుకు గొప్ప అవకాశంగా నిలుస్తోంది.

Next Story