Kokilaben Ambani: ముకేశ్ అంబానీ తల్లి కోకిలాబెన్‌కి తీవ్ర అస్వస్థత.. హెలికాప్టర్‌‌లో హాస్పిటల్ తీసుకెళ్లినట్లు టాక్!

by Ramesh Naini |

దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తల్లి కోకిలాబెన్ అంబానీ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం.

Kokilaben Ambani: ముకేశ్ అంబానీ తల్లి కోకిలాబెన్‌కి తీవ్ర అస్వస్థత.. హెలికాప్టర్‌‌లో హాస్పిటల్ తీసుకెళ్లినట్లు టాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తల్లి కోకిలాబెన్ అంబానీ (Kokilaben Ambani) తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. శుక్రవారం ఉదయం ఆమె అస్వస్థతకు గురవ్వడంతో ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ (HN Reliance Hospital) ఆస్పత్రికి తరలించినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఒక ప్రత్యేకమైన హెలికాప్టర్‌లో కోకిలాబెన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారని జాతీయ మీడియాలో వార్తలోచ్చాయి. అయితే, విషయం తెలిసిన వెంటనే.. హుటాహుటిన రిలయన్స్ ఆసుపత్రికి అంబానీ కుటుంబ సభ్యులు వెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఆయన భార్య ఓ కారులో వెళ్తుండగా.. ముకేశ్ అంబానీ కుటుంబం టైట్ సెక్యూరిటీతో ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం కోకిలాబెన్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు అంబానీ కుటుంబం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాగా, కోకిలాబెన్ వయస్సు 91 ఏళ్లు ఉండటంతో వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయంపై ఆస్పత్రి వర్గాలు కూడా ఇంకా స్పందించలేదు.

Next Story