Reliance: పెహల్‌గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు రిలయన్స్ ఉచిత చికిత్స

by S Gopi |

క్రూరమైన దాడిలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు ముఖేష్ అంబానీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Reliance: పెహల్‌గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు రిలయన్స్ ఉచిత చికిత్స
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో స్థానికులు, పర్యాటకులు సహా 26 మందిని చంపిన క్రూరమైన ఉగ్రవాద దాడి నేపత్యంలో దేశీయ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా క్రూరమైన దాడిలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు ముఖేష్ అంబానీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 'దాడిలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. వారికి మద్దతుగా ముంబైలోని తమ రిలయన్స్ ఫౌండేషన్ సర్ హెచ్‌ఎన్ ఆసుపత్రి గాయపడిన వారందరికీ ఉచిత చికిత్స అందజేస్తుంది' అని వెల్లడించారు. అనాగరికంగా జరిగిన ఈ ఉగ్రవాద దాడిలో బలైన అమాయక దేశీయ పౌరుల కోసం రిలయన్స్ సంస్థలోని ప్రతి ఒక్కరు విచారం వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరులో రిలయన్స్ కుటుంబం పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీకి, భారత ప్రభుత్వానికి, దేశం మొత్తానికి అండగా నిలుస్తుందని అన్నారు. ఉగ్రవాదం ఎక్కడున్నా మొత్తం మానవాళికే మరకలాంటిదని, అది ఏ రూపంలో ఉన్నా సహించరాది ముఖేష్ అంబానీ చెప్పారు.

Next Story